నేర చరితులు అధికార పీఠం ఎక్కితే ఏమవుతుందో వైఎస్ జగన్ రుజువు

ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఒక అరాచక శైలిలో పరిపాలన కొనసాగిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రజల్లో బీభత్స వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఎవరినైన విమర్శించాలన్నా, ప్రశ్నించాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అధికార పార్టీకి తొత్తుగా పనిచేయడమో, ప్రేక్షకులుగా మారడమో జరుగుతుంది. అధికార పార్టీలో ఉన్న వారు ఇష్టారాజ్యంలా గుండాలా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన అధికార ప్రతినిధి అన్న మాటకు, నానా బూతులు మాట్లాడుతుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అరాచకాన్ని సమర్థిస్తూ మాట్లాడారు! తాను రాజ్యాంగ హోదాలో ఉన్నానని చెప్పుకుంటున్న ఈ ముఖ్యమంత్రి రాజ్యాంగేతర శక్తులను ప్రోత్సహించేలా మాట్లాడడం, ఆయన ఫ్యాక్షనిస్టు మనస్తత్వాన్ని నిరూపిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఎక్కడికక్కడ రాజకీయ, సామాజిక వాతావరణం మరింత కలుషితమైంది.

రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు, ప్రభుత్వంపై భరోసా కోల్పోయిన ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ రకంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోంది. తన అరాచక అసమర్థ పాలనను ప్రజలు గుర్తించారని, సొంత పార్టీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని జగన్‌కు అర్థమైంది. అందుకే ప్రజలను వర్గాలుగా చీలగొట్టి పబ్బం గడుపుకునేందుకు ఆయన ఉద్దేశపూర్వకంగా ఉద్వేగ పరిస్థితులు కల్పించారు. రాష్ట్రంలో ఆర్థికవ్యవస్థ ఎంత దారుణంగా మారిందంటే కనీసం జీతాలు, పింఛన్లు కూడా సకాలంలో చెల్లించే పరిస్థితి కనపడడం లేదు. ప్రకటించిన సంక్షేమ పథకాలు కాగితాల్లో ప్రచారం చేస్తున్నారు కానీ ఆచరణలో అవి అంతగా అమలు కావడం లేదు. అప్పులు తెస్తేనే రాష్ట్రం మనుగడ సాధించలేని దుర్భర పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికి రూ. 5 లక్షల కోట్ల మేరకు అప్పులు చేశారు. అప్పులను సర్దుబాటు చేసుకోవడానికి భూములను తాకట్టు పెడుతున్నారు. మటన్, సినిమా టిక్కెట్లను కూడా వదలలేదు. విద్యుత్ చార్జీలు, చెత్తపన్ను, ఇంటిపన్ను, పెట్రోల్ చార్జీలతో ప్రజలను చావ బాదుతున్నారు. మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నామంటూ అత్యధిక ధరలతో పనికిరాని బ్రాండ్ల అమ్మకాన్ని అనుమతించి భారీ వసూళ్లు చేసుకుంటున్నారు. మద్యం, దొంగసారాయి, గంజాయి వ్యాపారంతో జేబులు నింపుకుంటున్నారు. రైతులకు మద్దతు ధరలు లభించడం లేదు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అమలు చేసిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను నిర్లక్ష్యం చేసి ప్రజలు, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో పనికిమాలిన సలహాదారులను నియమించుకుని ఖజానాను దుర్వినియోగం చేస్తున్నారు. కబ్జాల సంస్కృతి పరాకాష్ఠకు చేరింది. ఇటీవల అవినీతి, వ్యక్తిత్వం, పరిపాలన, ప్రజలతో సంబంధాలు, ప్రభుత్వ కార్యక్రమాల ఆధారంగా ‘సీ ఓటర్’ అన్న సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో దేశంలోనే ఎమ్మెల్యేలపై భారీ వ్యతిరేకత ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశే అని తేలింది. ఈ వ్యతిరేకత గురించి తెలిసినందువల్లే ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్లకుండా తన తాడేపల్లి ఇంధ్రభవనానికి పరిమితమయి మాఫియా, ఫ్యాక్షనిస్టు చర్యలకు అక్కడి నుంచి తెరలేపుతున్నారు. నేర చరితులు అధికార పీఠం ఎక్కితే ఏమవుతుందో జగన్ రుజువు చేస్తున్నారు.

#AndhraPradesh

- Vinod Kumar India 

Popular posts from this blog

75 సంవత్సరాల భారతదేశం..