75 సంవత్సరాల భారతదేశం..
75 సంవత్సరాల భారతదేశం వేసిన అడుగులలో వెనకు మళ్ళీ చూసుకుంటే...!!! ౼ "నీ అడుగులు అడిగి చూడూ... నువ్వు నడచిన దూరం, నువ్వు కోల్పోయిన ఎందరో మహానుభావులు త్యాగాలను,కష్టాలను అడుగు...అయినా వీడదా ఈ పేదరికం, దారిద్య్రం వీడదా!". దీనికి సమాధానం #అవినీతిరాజకీయనాయకులు_మన_దేశాన్ని_పరిపాలిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు! బ్రిటీష్ పరిపాలనలో దోచుకున్న భారతదేశముకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయ్యాయి. కానీ ఈ దేశంలో ఇంకా స్వాతంత్ర్యము రాలేదు. ఎందుకంటే అపుడు స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ వారు దోచుకున్నారు...ఇప్పుడు మన భారతీయులైన #రాజకీయనాయకులు మన దేశమును దోచుకుంటున్నారు. భారతదేశంలోనే పుట్టి #భరతమాతను దోచుకుంటున్నారు. ఎలాగంటే మనదేశంలో౼౼ అభివృద్ధి పేరుతో వివిధ ప్రాజెక్టులు, పథకాలు అంటూ ప్రజాధనాన్ని ప్రజలకు అందకుండానే అవినీతి ప్రాజెక్టులు, అవినీతి పథకాలుగా మారుస్తున్నారు. బ్రిటిష్ వారు అయితే మన దేశం వాళ్ళు కాదు కాబట్టి వారిని మన దేశం నుండి తరిమికొట్టాము. మరీ మన దేశంలో పుట్టి, మన దేశాన్ని దోచుకుంటున్నా ఈ #రాజకీయనాయకులను ఏమి చేయాలి? అని ఆలోచిస్తే...!!! సమాధానం దొరకదు, ప్రశ్నార్ధకం? కానీ ఓటు హక్కు ద్వారా ఇలాంటి #అవినీతిరాజకీయనాయకులను తరిమికొట్టే అవకాశం భారతదేశ ప్రజలకు ఉంది. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి అవినీతి నాయకులను ఎన్నుకోకుండా చైతన్యం కలిగిన ప్రజలుగా ఉంటూ #భారతదేశాన్ని #అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా చేయాల్సిన ఆవశ్యకత ప్రజల మీద ఉంది. అప్పుడే #భారతదేశం_అభివృద్ధి_చెందిన_దేశంగా_మారుతుంది.
- Vinod Kumar India