రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి..!

రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి..!


భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 ఏండ్లయిన ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రపంచ దేశాలన్నీ మారుతున్న ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా సాంకేతికతను అందిపుచుకుంటూ అభివృద్ధి పథంలో పాయనిస్తుంటే భారతదేశంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఇలాంటి సమయంలో లోపం ఎక్కడ ఉంది అన్ని మన వ్యవస్థను మనమే శల్య పరీక్ష చేసుకోవాల్సిన సమయమిది.

నాయకులకు ఎన్నుకోబడే వారిలో చాలా మంది కనీస పరిజ్ఞానం లేకుండా ఉంది. రాజకీయ నాయకత్వం అనేది ఒక బాధ్యతహుతమైన పదవి కనుక దీనికి సరైన అర్హత పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా చిన్న క్లర్క్, అటెండర్ ఉద్యోగులకు అర్హత పరీక్షలు నిర్వహిస్తారు. కానీ 5 ఏండ్ల ప్రజలను పాలించాల్సిన ప్రజా ప్రతినిధులకు ఎలాంటి అర్హత పరీక్ష ఉండదు. అసలు ఏ ప్రాతిపదిక మీద ఆధారంగా అతన్ని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకుంటున్నారున్నడానికి స్పష్టత లేదు. కేవలం ధన బలం, తమ సామాజిక వర్గానికి సపోర్ట్ ఒక్కటే రాజకీయంగా ఎదగడానికి పునాది అవుతుంది. ఇంకా కుటుంబ వ్యవస్థ, వారసత్వంగా నాయకులుగా ఎదుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఎంత బేవర్స్ గా తిరిగేవాడైతే అంత పరపతి, ఎంత డబ్బు, మద్యం ఖర్చు చేస్తే అంత గెలుపు. ఇలాంటి గబ్బు పట్టిన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన నేటి సామాజికావసరం.

నాయకులకు ఎన్నుకోబడే వారిలో చాలా మంది కనీస పరిజ్ఞానం లేకుండా చేస్తున్న వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. మహాభారతం కాలంలో ఇంటర్నెట్ ఉండేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రతినిధులు ఒక విషయంలో ఆలోచించాలి. పురాణాల కాలంలోనే ఇంటర్నెట్ లాంటి సాంకేతికత, వేదాల్లో విమానాలు ఉంటే, నేటికి కనీసం కరెంట్ సదుపాయం కూడా లేని గ్రామాలు ఈ దేశంలో ఇంకా ఎందుకున్నాయి..? విద్య, వైద్య సదుపాయాలకు దూరంగా ప్రజలు ఎందుకు బతుకుతున్నారు అన్ని ఒక సైద్ధాంతిక విమర్శ చేసుకోవాలి.

ఉదాహరణకు వ్యవసాయ శాఖామంత్రికి అసలు వ్యవసాయం గూర్చి ఎలాంటి అవగాహన ఉండదు. ఆరోగ్యశాఖ మంత్రికి ఆరోగ్యం, వ్యాధులు మెడిసిన్స్, ప్రజలకు కల్పించాల్సిన కనీస ఆరోగ్య అవసరాల మీద అవగాహన ఉండదు. హోంమంత్రికి పోలీస్ వ్యవస్థ గురించి ఎంత వరకు తెలుసన్నది ప్రశ్నార్థకమే..? ఇలా సదరు శాఖలు నిర్వహించే మంత్రులకు ఆయా శాఖల మీద కనీస పరిజ్ఞానం, శాస్ర్తియ సాంకేతికత గూర్చి అవగాహన లేదనే చెప్పాలి.

ఒక దేశమైన, ప్రాంతమైన, చిన్న గ్రామమైన అభివృద్ధి చెందాలంటే ఆయా దేశానికి, ప్రాంతానికి, గ్రామానికి తగినన్ని వనరులు ఉండాలి. అలాగే ఆ వనరులను సక్రమంగా వినియోగించగల పటిష్టమైన రాజకీయ వ్యవస్థ, దాని నడిపించే నాయకత్వం ఉండాలి. మన దేశం ఎన్నో సహజ వనరులున్న దేశం. కానీ వాటిని సక్రమంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన ప్రయత్నంలో రాజకీయ యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా తెలుస్తుంది.

ప్రజలలో కూడా రాజకీయ చైతన్యం తీసుకురావాలి. ప్రజలు ఎవరికి ఓటు వేసున్నారో ఆలోచించుకోవాలి..? రాజకీయ వ్యవస్థ అనేది బాధ్యతహుతమైన పదవి, అంత బాధ్యతహుతమైన పదవుల్లో దొంగలను, దోపిడీ దారులను, అవినీతి చేసే నాయకులను, మత చాందసవాదులను, దేశం గూర్చి ఒక ఐడియాలజీ లేని అజ్ఞానులను ఎన్నుకుందామా..? లేక మేధావులను ఈ దేశ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుందామా..? అనే నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉంది.

 
                                   
                                            Sincerely

                                    Vinod Kumar India 
                                     (Voice Of People)

Popular posts from this blog

75 సంవత్సరాల భారతదేశం..