'ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం తప్పనిసరి'.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం..
'ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం తప్పనిసరి'.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం తప్పనిసరి, అదీ అధికారం చేపట్టిన ప్రభుత్వ పనితీరుని సదా పరిశీలిస్తూ.. 'తప్పు-ఒప్పుల'పై ప్రతి పక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు విమర్శించడం మాములు విషయం. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారు స్పందించి జవాబు ఇవ్వటం మామూలే. ఒకప్పుడు రాజకీయాలు అంటే హుందాగా, గౌరవంగా ఉండేవి.. విమర్శలు, ప్రతి విమర్శలు కూడా పాలసీల గురించి, ప్రభుత్వ విధి విధానాలను గురించే ఉండటం సర్వ సాధారణం. కానీ కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న హుందాతనం గౌరవం తగ్గిపోయాయి విమర్శలకు ప్రతి విమర్శలు విధాన పరమైనవి కాకుండా దారి తప్పి, నీతి తప్పి 'వ్యక్తిగత జీవితాల'పై విమర్శలు చేయటం ఫోర్త్ ఎస్టేట్‌గా పిలవబడుతున్న మీడియాను అనుకూలంగా మార్చుకొని తప్పుడు ప్రచారాలు చేయటం అలవాటై పోయింది కొన్ని రాజకీయ పార్టీలకు. అది కాస్తా ఈ దశాబ్ద కాలం లో విపరీత ధోరణికి పెరిగిపోయింది. టెక్నాలజీ పెరిగి మీడియా, వెబ్‌సైట్స్, యూ ట్యూబ్ చానల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. డబ్బు కోసం దిగజరిపోయి తప్పుడు ప్రచారాలు చేయటం ఒక ఆనవాయితీగా మార్చుకున్నా...